Today Horoscope: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. వాహనయోగం

23 Dec, 2022 06:28 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: అమావాస్య సా.4.38 వరకు, తదుపరి పుష్య శు.పాడ్యమి, నక్షత్రం: మూల రా.3.02 వరకు,తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.01 నుండి 1.32 వరకు, తిరిగి రా.1.31 నుండి 3.02, దుర్ముహూర్తం: ఉ.8.40 నుండి 9.24 వరకు, తదుపరి ప.12.21 నుండి 1.04 వరకు, అమృతఘడియలు: రా.9.01 నుండి 10.31 వరకు;

రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు;
సూర్యోదయం 6.30;
సూర్యాస్తమయం 5.27.
 

మేషం: పనులలో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. విద్యార్థులకు అసంతృప్తి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృషభం: బంధువులతో కొద్దిపాటి విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

మిథునం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో  చికాకులు. ఆధ్యాత్మిక చింతన. ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు.

కన్య: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కొద్దిపాటి వివాదాలు. ఉద్యోగ, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.

తుల: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవచింతన.

వృశ్చికం: వ్యవహారాలలో అవరోధాలు. దనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.  ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు.

ధనుస్సు: కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువుల ద్వారా శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. 

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడుడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు. విద్యార్థులకు నిరుత్సాహం.

కుంభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత అభివృద్ధి కనిపిస్తుంది.

మీనం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వాహన, గృహయోగాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. ఇంటాబయటా ప్రోత్సాహకరం. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మరిన్ని వార్తలు