ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది

24 Jun, 2022 07:18 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.ఏకాదశి రా.1.04 వరకు, తదుపరి ద్వాదశి
నక్షత్రం అశ్వని ఉ.10.58 వరకు, తదుపరి భరణి, వర్జ్యం ఉ.6.50 నుండి 8.31 వరకు, తిరిగి రా.9.04 నుండి 10.44 వరకు, దుర్ముహూర్తం ఉ.8.06 నుండి 8.59 వరకు, తదుపరి ప.12.29 నుండి 1.21 వరకు, అమృతఘడియలు... లేవు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం     :  6.34
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. 

వృషభం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 

మిథునం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం.

కన్య: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 

తుల.: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

వృశ్చికం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. 

ధనుస్సు: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. 
మకరం...రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మీనం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు