ఈ రాశి వారికి శుభవర్తమానాలు అందుతాయి

24 Jul, 2022 06:49 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం తిథి బ.ఏకాదశి ప.2.34 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం రోహిణి రా.11.33 వరకు తదుపరి మృగశిర, వర్జ్యం ప.2.50 నుండి 4.34 వరకు, దుర్ముహూర్తం సా.4.47 నుండి 5.40 వరకు, అమృతఘడియలు... రా.8.02 నుండి 9.46 వరకు. 

సూర్యోదయం        :  5.39
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. మీ ఉద్యోగయత్నాలు ఫలించకపోవచ్చు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ప్రముఖుల నుండి పిలుపు రావచ్చు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం... కొన్ని పనుల్లో ఆటంకాలు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం... బంధువులతో సత్సంబంధాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం... కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య... ఇంటాబయటా సమస్యలు తప్పవు. పనుల్లో కొన్ని ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.

తుల... బంధువులతో విరోధాలు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

వృశ్చికం... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు... దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభవర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వానహయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మకరం... పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం... రాబడి అంతగా కనిపించదు. భూవివాదాలు నెలకొంటాయి. బాధ్యతలతో సతమతమవుతారు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

మరిన్ని వార్తలు