Today Horoscope: ఈ రాశివారికి కుటుంబంలో సమస్యలు.. ఆరోగ్యభంగం

24 Nov, 2022 06:40 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.పాడ్యమి రా.2.57 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: అనూరాధ రా.9.18 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.2.36 నుండి 4.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.23 నుండి 3.06 వరకు, అమృతఘడియలు: ఉ.11.17 నుండి 12.50 వరకు;

రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;
సూర్యోదయం 6.13;
సూర్యాస్తమయం 5.20. 

మేషం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు.

వృషభం: పలుకుబడి మరింత పెంచుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు నిలుపుకుంటారు.

మిథునం: సన్నిహితులతో వివాదాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు. పనులలో జాప్యం. ఆలోచనలు కలసిరావు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.

సింహం: ఆర్థిక లాభాలు పొందుతారు. పనులు చకచకా సాగుతాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తివివాదాల పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

కన్య: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆ«లయాలు సందర్శిస్తారు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో కొన్ని సమస్యలు. ఉద్యోగాలలో వివాదాలు.

తుల: బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. బంధువులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

ధనుస్సు: చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. పనులు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రశంసలు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

కుంభం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. పనులు మందగిస్తాయి. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మరిన్ని వార్తలు