Today Horoscope: ఈ రాశివారికి శుభవార్తలు.. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి

24 Dec, 2022 06:43 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్య‡ మాసం, తిథి:  శు.పాడ్యమి ప.2.11 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పూర్వాషాఢ రా.1.23 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం: ప.11.56 నుండి 1.26 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.32 నుండి 7.59 వరకు, అమృతఘడియలు: రా.8.53 నుండి 10.23 వరకు;

రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు,
యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు;
సూర్యోదయం 6.31;
సూర్యాస్తమయం 5.28.
 

మేషం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు.  కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఉద్యోగ, వ్యాపారాలు మందగిస్తాయి.

వృషభం: పనుల్లో జాప్యం. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. ఇంటాబయటా నిరుత్సాహం. ఉద్యోగ, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి

మిథునం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత.

కర్కాటకం: కొత్త ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. వస్తులాభాలు. ఉద్యోగ, వ్యాపారాలలో మరింత పురోగతి.

సింహం: మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనులు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. దైవచింతన.

కన్య: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు.  ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల కృషి అంతగా ఫలించదు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.

తుల: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. 

వృశ్చికం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపార, వ్యాపారాలలో పురోగతి. 

మకరం: పనుల్లో విజయం. దూరపు బంధువుల కలయిక. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగ,  వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. 

కుంభం: ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనారోగ్యం. ఉద్యోగ, వ్యాపారాలు ముందుకు సాగవు. 

మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆధ్యాత్మిక చింతన. శుభవార్తలు. ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధి. 

మరిన్ని వార్తలు