ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి

25 Jun, 2022 06:59 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.ద్వాదశి రా.1.55 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం భరణి ప.12.14 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం రా.1.06 నుండి 2.51 వరకు దుర్ముహూర్తం ఉ.5.32 నుండి 7.14 వరకు,  అమృతఘడియలు... ఉ.7.11 నుండి 8.54 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు


మేషం...పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి ముఖ్య సమాచారం. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

వృషభం....సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. స్థిరాస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మిథునం...దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం..ఆత్మీయుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం....ఎంత శ్రమపడినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గంతో తగాదాలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య....సన్నిహితుల నుండి విమర్శలు. పనుల్లో ఆటంకాలు. ఉద్యోగయత్నాలు ఫలించవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల..పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

వృశ్చికం...కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. యుక్తితో సమస్యలు అధిగమిస్తారు. విద్యార్థులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు...శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతోతగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం...వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కుంభం....కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. ధనలబ్ధి. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం....మిత్రులే శత్రువులుగా మారతారు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మరిన్ని వార్తలు