Today Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి

25 Nov, 2022 06:30 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.విదియ రా.1.02 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: జ్యేష్ఠ రా.8.04 వరకు, తదుపరి మూల, వర్జ్యం: రా.3.35 నుండి 5.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.11 వరకు, తదుపరి ప.12.08 నుండి 12.54 వరకు, అమృతఘడియలు: ఉ.11.43 నుండి 1.14 వరకు;

రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు;
సూర్యోదయం 6.13;
సూర్యాస్తమయం 5.20.
 

మేషం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలపై స్థిరత్వం ఉండదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

వృషభం: పరిచయాలు కొంత పెరుగుతాయి. ఆస్తులు సమకూరతాయి. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం: కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

సింహం: రాబడికి మించిన ఖర్చులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి. 

కన్య: వ్యవహారాలలో విజయం. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: గతం నుండి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కుంభం: వ్యవహారాలు సానుకూలమవుతాయి. సంఘంలో మరింత గౌరవం. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మరిన్ని వార్తలు