ఈ రాశివారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి.. నూతన ఉద్యోగాలు

25 Dec, 2022 06:34 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: శు.విదియ ఉ.11.54 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.44 వరకు, తదుపరి శ్రవణం, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.8.50 నుండి 10.14 వరకు తిరిగి రా.3.25 నుండి 4.54 వరకు, దుర్ముహూర్తం: సా.4.01 నుండి 4.44 వరకు, అమృతఘడియలు: సా.5.46 నుండి 7.12 వరకు.

సూర్యోదయం        :  6.31
సూర్యాస్తమయం    :  5.28
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిíß తులతో సఖ్యత. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

వృషభం: కుటుంబసమస్యలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అసంతృప్తి.

మిథునం: ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహమే

కర్కాటకం: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు.పనులు చకచకా సాగుతాయి. భూవివాదాల పరిష్కారం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కన్య: బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

తుల: పాతమిత్రుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప తగాదాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు: అనుకున్న పనుల్లో ఆటంకాలు. రుణాలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి

మకరం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగాలు. బంధువుల కలయిక.  స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మీనం: కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం

మరిన్ని వార్తలు