ఈ రాశి వారు శుభ వార్తలు వింటారు

26 Jul, 2022 06:47 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.త్రయోదశి సా.6.07 వరకు, తదుపరి చతుర్దశి
నక్షత్రం ఆరుద్ర తె.4.27 వరకు (తెల్లవారితే బుధవారం), తదుపరి పునర్వసు, వర్జ్యం ఉ.11.12 నుండి 12.56 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.06 వరకు, తదుపరి రా.10.58 నుండి 11.44 వరకు, అమృతఘడియలు... సా.5.22 నుండి 7.10 వరకు. 

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

మేషం: సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు అనూహ్యంగా వసూలవుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: కుటుంబ సభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మిథునం: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సోదరుల ద్వారా ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు వచ్చే సూచనలు.

కర్కాటకం: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: సన్నిహితులు, సోదరులతో సఖ్యత. విందువినోదాలు. కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి.

తుల: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు.

వృశ్చికం: శ్రమ కొంత పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు: భూవివాదాలు పరిష్కారం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మకరం: యత్నకార్యసిద్ధి. ప్రముఖుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కుంభం: శ్రమాధిక్యంతో పనులు పూర్తి. కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. ధనవ్యయం.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మరిన్ని వార్తలు