ఈ రాశి వారికి పనుల్లో విజయం, శుభవార్త వింటారు

27 Aug, 2022 06:46 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, తిథి: అమావాస్య ప.1.05 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమి, నక్షత్రం: మఖ రా.8.54 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం: ఉ.7.58 నుండి 9.43 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.47 నుండి 7.28 వరకు, అమృతఘడియలు: సా.6.19 నుండి 8.03 వరకు, పోలాల అమావాస్య.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం: రుణయత్నాలు ముమ్మరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

వృషభం: కొత్త వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అభివృద్ధి.

మిథునం: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహం. కొత్త నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

సింహం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: సన్నిహితులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన. పరిస్థితులు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: మిత్రులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. ధనవ్యయం. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

వృశ్చికం: నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినరీతిలో కొనసాగుతాయి.

ధనుస్సు: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనుల్లో విజయం. నూతన పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మకరం: శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: కొన్ని పనులు హఠాత్తుగా విరమిస్తారు. శ్రమ తప్పదు. బంధువులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. ఆర్థిక పరిస్థితి అంతంతగానే ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. శుభవార్తలు వింటారు. ధనప్రాప్తి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మరిన్ని వార్తలు