ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆర్థిక విషయాలు సంతృప్తికరం

27 Sep, 2022 06:35 IST|Sakshi

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.విదియ రా.2.41 వరకు తదుపరి తదియ, నక్షత్రం: హస్త ఉ.7.32 వరకు, తదుపరి చిత్త వర్జ్యం: ప.3.32 నుండి 5.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.41 నుండి 11.29 వరకు అమృతఘడియలు: రా.1.11 నుండి 2.45 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.52
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మేషం: ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం: మిత్రులతో విభేదాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: సన్నిహితులతో వైరం. అంచనాలు తారుమారు. వ్యవహారాలలో అవాంతరాలు. కష్టానికి తగిన ఫలితం కనిపించదు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. ఆస్తిలాభం. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: శుభవార్తలు వింటారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇతరులకు సాయం అందిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: కొన్ని పనులలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

వృశ్చికం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

ధనుస్సు: వివాదాల నుండి గట్టెక్కుతారు. స్వల్ప ధనలబ్ధి. ప్రముఖుల నుండి ఆహ్వానాలు. చర్చలు సఫలం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మకరం: పనులు చక్కదిద్దడంలో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

కుంభం: రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: శుభవార్తా శ్రవణం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. సన్నిహితుల సాయం అందుతుంది. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

మరిన్ని వార్తలు