ఈ రాశివారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి

28 Apr, 2022 06:11 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి బ.త్రయోదశి రా.12.50 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాభాద్ర సా.6.21 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం... లేదు, దుర్ముహూర్తం ఉ.9.50 నుండి 10.42 వరకు తదుపరి ప.2.53 నుండి 3.43 వరకు అమృతఘడియలు... ప.1.31 నుండి 3.06 వరకు.

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.14
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:
మేషం... పనులు నిదానిస్తాయి. ఆత్మీయులతో మాటపట్టింపులు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో గందరగోళ పరిస్థితి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృషభం... పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం... సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ లక్ష్యాలు నెరవేరతాయి.

కర్కాటకం... మిత్రులతో వైరం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం... కుటుంబంలో వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కన్య... రుణభారాలు తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సమాజంలో గౌరవం. భూవివాదాలు తీరతాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన ప్రగతి.

వృశ్చికం... రుణదాతల ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. మీపై కొందరు పెత్తనం చేస్తారు. స్వల్ప అనారోగ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

ధనుస్సు... సన్నిహితులతో కలహాలు. మానసిక సంఘర్షణ. దూరప్రయాణాలు. బంధువుల కలయిక. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మకరం... శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. చర్చలు సఫలం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

కుంభం... కుటుంబసభ్యులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. మానసిక అశాంతి. వ్యాపారాలు విస్తరణ నిలిపివేస్తారు. ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మీనం... శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

మరిన్ని వార్తలు