ఈ రాశి వారు విందు వినోదాల్లో పాల్గొంటారు

28 May, 2022 06:17 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.త్రయోదశి ప.1.20 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం  భరణి తె.4.44 వరకు (తెల్లవారితే ఆదివారం) తదుపరి కృత్తిక, వర్జ్యం ప.1.31 నుండి 3.10 వరకు దుర్ముహూర్తం ఉ.5.31 నుండి 7.13 వరకు అమృతఘడియలు... రా.11.38 నుండి 1.24 వరకు.

సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలు వాయిదా. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఖర్చులు. అధికం. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు విశ్రాంతి లోపం.

మిథునం: కొత్త  పనులు విజయవంతంగా పూర్తి. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు తీరతాయి. వాహన సౌఖ్యం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. 

కర్కాటకం: సంఘంలో పరపతి పెరుగుతుంది. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన కాలం.

సింహం: ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా. కృషికి తగ్గ ఫలితం అంతంత మాత్రమే. పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు స్వల్ప ఒత్తిడులు.

కన్య: కార్యక్రమాలలో జాప్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ప్రముఖులతో సంభాషణలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొంత అనుకూలం.

తుల: పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఎదురుండదు.  కొత్త వ్యక్తుల పరిచయం. కళాకారులకు సన్మానాలు.

వృశ్చికం: ఇంటిలో శుభకార్యాలు. అదనపు ఆదాయం. ముఖ్య నిర్ణయాలు. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. తీర్థయాత్రలు. విందువినోదాలు. అప్రయత్న కార్యసిద్ధి. వాహనసౌఖ్యం. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. 

మకరం: ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదిగా కొనసాగుతాయి. స్నేహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఉద్యోగులు మరింత శ్రమించాలి.

కుంభం: సోదరులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. దేవాలయ దర్శనాలు. విందులువినోదాలు. కొత్త నిర్ణయాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతమైన సమయం.

మీనం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటారు. స్వల్ప అనారోగ్యం. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు పనిభారం.

మరిన్ని వార్తలు