Today's Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం

28 Jun, 2022 06:48 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి అమావాస్య పూర్తి (24గంటలు), నక్షత్రం మృగశిర సా.6.31 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం తె.3.51 నుండి 5.36 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.41 వరకు అమృతఘడియలు... ఉ.8.48 నుండి 10.34 వరకు. 

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.34
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక ప్రగతి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు అందుతాయి. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: పాతబాకీలు వసూలవుతాయి. ఆస్తి విషయంలో ఒప్పందాలు. అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

కన్య: బంధువులతో తగాదాలు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. కార్యజయం. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: రుణబాధలు తొలగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం. దైవదర్శనాలు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

మకరం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల కొనుగోలు వాయిదా. పనులలో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మీనం: బంధువుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మరిన్ని వార్తలు