ఈ రాశి వారికి ధనలాభం, విందువినోదాల్లో పాల్గొంటారు

28 Aug, 2022 07:04 IST|Sakshi

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.పాడ్యమి ప.2.03 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: పుబ్బ రా.10.22 వరకు, తదుపరి ఉత్తర వర్జ్యం: ఉ.5.22 నుండి 7.04 వరకు దుర్ముహూర్తం: సా.4.35 నుండి 5.27 వరకు, అమృతఘడియలు: ప.3.32 నుండి 4.56 వరకు.

సూర్యోదయం        :  5.48
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో కొద్దిపాటి  ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయ దర్శనాలు. శ్రమ మరింత పెరుగుతుంది.

వృషభం: కొన్ని వ్యవహారాలు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. ఆస్తి వివాదాలతో కొంత ఇబ్బందిపడతారు. దైవచింతన .

మిథునం: నూతన వరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి.

కర్కాటకం: పనుల్లో స్వల్ప అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వృత్తి, వ్యాపారాలలో మరింత ఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు.  స్వల్ప ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం.

సింహం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. విద్యార్థులకు నూతనోత్సాహం. కొన్ని వివాదాల పరిష్కారం.

కన్య: అనుకోని ధనవ్యయం. దూరప్రయాణాలు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ప్రతిష్ఠంభన. అనారోగ్యం. వ్యాపారాలలో సామాన్య లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. దైవదర్శనాలు..

తుల: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి.  వృత్తి,వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో కొన్ని  వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు.కొత్త రుణాలు చేయాల్సిన పరిస్థితి. వృత్తి, వ్యాపారాలు భారంగా మారతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులతో వైరం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగానే సాగుతాయి. కొద్దిపాటి ఆరోగ్య, కుటుంబసమస్యలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం.

కుంభం: చేపట్టిన పనులు అనుకున్న విధంగా సాగుతాయి. తీర్థయాత్రలు.విందువినోదాలు.సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి..

మీనం: విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మరిన్ని వార్తలు