ఈ రాశి వారికి అన్నింటా విజయమే, కీలక నిర్ణయాలు తీసుకుంటారు

28 Sep, 2022 07:17 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.తదియ రా.1.44 వరకు తదుపరి చవితి, నక్షత్రం: చిత్త ఉ.7.35 వరకు తదుపరి స్వాతి, వర్జ్యం: ప.1.07 నుండి 2.43 వరకు దుర్ముహూర్తం: ప.11.29 నుండి 12.16 వరకు అమృతఘడియలు: రా.10.33 నుండి 12.06 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.51
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు.  పనుల్లో ప్రతిబంధకాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని మార్పులు.

సింహం: కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కన్య: పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజసేవలో భాగస్వాములవుతారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు.

మకరం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. దూరపు బంధువుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

కుంభం: బంధువులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీనం: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మరిన్ని వార్తలు