ఈ రాశివారి శ్రమ ఫలిస్తుంది.. శుభవార్తలు వింటారు

28 Nov, 2022 06:53 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.పంచమి సా.6.11 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.24 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: రా.7.06 నుండి 8.36 వరకు, దుర్ముహూర్తం: ప.12.09 నుండి 12.55 వరకు, తదుపరి ప.2.23 నుండి 3.06 వరకు, అమృతఘడియలు: ప.12.32 నుండి 2.04 వరకు; రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు; సూర్యోదయం 6.15; సూర్యాస్తమయం 5.20. 

మేషం: వ్యవహారాలలో మరింత పురోగతి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

కర్కాటకం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వస్తులాభాలు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.

కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: బంధువులతో తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మానసిక అశాంతి. దైవదర్శనాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. సోదరులతో సఖ్యత. చర్చలు సఫలం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

ధనుస్సు: కుటుంబంలో సమస్యలు. మానసిక అశాంతి. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: శ్రమ ఫలిస్తుంది. వివాదాల నుండి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరం ఉండవు. బాధ్యతలతో సతమతం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
 

మరిన్ని వార్తలు