Today Horoscope: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆకస్మిక ధన,వస్తులాభాలు

29 Nov, 2022 06:50 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.షష్ఠి ప.3.50 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: శ్రవణం ప.1.44 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం: సా.5.31 నుండి 7.01 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.27 నుండి 9.13 వరకు, తదుపరి రా.10.31 నుండి 11.23 వరకు, అమృతఘడియలు: ఉ.9.27 నుండి 10.36 వరకు;

రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు;
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు;
సూర్యోదయం 6.16;
సూర్యాస్తమయం 5.20. 

మేషం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

వృషభం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

మిథునం: వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కర్కాటకం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో మరింత ఆదరణ. వస్తు, వస్త్రలాభాలు. నూతన ఉద్యోగప్రాప్తి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. శ్రమకు ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

తుల: మిత్రులు, బంధువులతో సఖ్యత. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

వృశ్చికం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

మీనం: కొన్ని వివాదాలు తీరి ఊరట చెందుతారు. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

మరిన్ని వార్తలు