దినఫలం: ఈ ఆరు రాశులవారికి ఆర్థికంగా ఆశాజనకం.. మిగతా రాశులవారికి ఇలా..

30 May, 2023 06:34 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, మే 30 మంగళవారం
జ్యేష్ఠ మాసం, తిథి: శు.దశమి ఉ.10.05 వరకు, తదుపరి ఏకాదశి,
నక్షత్రం: హస్త రా.3.34 వరకు, తదుపరి చిత్త,
సూర్యోదయం :    5.29
సూర్యాస్తమయం    :  6.26

వర్జ్యం: ఉ.10.54 నుండి 12.36 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.03 నుండి 8.55 వరకు, తదుపరి రా.10.52 నుండి 11.34 వరకు,
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుండి 10.30 వరకు 

అమృతఘడియలు: రా.9.11 నుండి 10.53 వరకు.

మేషం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత. 

వృషభం: ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. 

మిథునం: శ్రమాధిక్యం. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. వృత్తి, వ్యాపారాలలో నిరాశ తప్పదు. ఆధ్యాత్మిక చింతన. 

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విలువైన సమాచారం. వస్తులాభాలు. ఇంటాబయటా ప్రోత్సాహం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.  కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. నిర్ణయాలు వాయిదా. 

కన్య: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆధ్యాత్మిక చింతన. 

తుల: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దూరప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. 

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
 
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి కీలక సమాచారం. ముఖ్య నిర్ణయాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. 

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో నిరాశ చెందుతారు.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో అనుకూలత. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి.

మరిన్ని వార్తలు