ఈ రాశి వారికి ఆర్థికాభివృద్ధి, వ్యాపారాలు ఉద్యోగాలలో పైచేయి

30 Jul, 2022 07:19 IST|Sakshi

సూర్యోదయం :    5.40
సూర్యాస్తమయం    :  6.31
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం , తిథి శు.విదియ రా.1.11 వరకు తదుపరి తదియ, నక్షత్రం ఆశ్లేష ఉ.11.44 వరకు, తదుపరి మఖ, వర్జ్యం రా.12.38 నుండి 2.24 వరకు దుర్ముహూర్తం ఉ.5.42 నుండి 7.24 వరకు అమృతఘడియలు... ఉ.10.01 నుండి 11.44 వరకు. 

మేషం: ముఖ్య నిర్ణయాలు వాయిదా పడతాయి. ఆలోచనలు ఎంతకీ కొలిక్కిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మిథునం: మిత్రులు, శ్రేయోభిలాషులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

సింహం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. దైవచింతన. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.

కన్య: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

తుల: పరిచయాలు మరింత పెరుగుతాయి. స్థిరాస్తివృద్ధి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారవచ్చు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

ధనుస్సు: చేపట్టిన పనులు ముందుకు సాగవు. సోదరులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: పాతమిత్రుల కలయిక. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఎంతోకాలంగా వేచిచూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీనం: మిత్రుల నుండి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలను వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

మరిన్ని వార్తలు