దినఫలం: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. మిగతా రాశులవారికి ఇలా..

31 May, 2023 06:54 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బుధవారం, మే 31
సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.26. 
తిథి: శు.ఏకాదశి ఉ.10.52 వరకు, తదుపరి ద్వాదశి,
నక్షత్రం: చిత్త తె.4.42 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి స్వాతి,

వర్జ్యం: ఉ.11.54 నుండి 1.34 వరకు,
దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.23 వరకు,
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు,

అమృతఘడియలు: రా.9.56 నుండి 11.34 వరకు;
 

గ్రహఫలం

మేషం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపార,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: మిత్రులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. కొన్ని పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉంటాయి. 

మిథునం: బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆస్తి విషయాలలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

సింహం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. 

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

తుల: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిరాశపరుస్తాయి. 

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. 

ధనుస్సు: కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆధ్యాత్మిక చింతన. 

మకరం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

కుంభం: కుటుంబంలో చికాకులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. బంధువులతో వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ. 

మీనం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. 

మరిన్ని వార్తలు