Horoscope Today: ఈ రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు

1 Oct, 2021 06:37 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి బ.దశమి రా.7.09 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రా.12.30 వరకు, తదుపరి ఆశ్లేష,  వర్జ్యం ఉ.7.28 నుండి 9.11 వరకు, దుర్ముహూర్తం ఉ.8.17 నుండి 9.06 వరకు తదుపరి ప.12.21 నుండి 1.09 వరకు అమృతఘడియలు... సా.5.40 నుండి 7.22 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం :  5.48
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం...పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

వృషభం...కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. బంధువుల కలయిక. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మిథునం...వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్య సమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం....కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. కీలక నిర్ణయాలు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

సింహం...సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. దూరప్రయాణాలు. నిర్ణయాలలో పొరపాట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య....వివాహయత్నాలు సానుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

తుల....నూతన కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా మీదే పైచేయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

వృశ్చికం...శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు....పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మకరం....పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం..స్థిరాస్తి వృద్ధి. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం....వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో కలహాలు. దైవదర్శనాలు. ఆస్తి కొనుగోలులో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులకు సిద్ధపడాలి.

మరిన్ని వార్తలు