ఈ రాశివారికి ఆకస్మిక ప్రయాణాలు

1 Nov, 2021 06:23 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.ఏకాదశి ఉ.9.19 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం పుబ్బ ఉ.10.04 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం సా.5.10 నుండి 6.44 వరకు దుర్ముహూర్తం ప.12.08 నుండి 12.54 వరకు తదుపరి ప.2.25 నుండి 3.11 వరకు అమృతఘడియలు... రా.2.38 నుండి 4.12 వరకు.

సూర్యోదయం :    6.02
సూర్యాస్తమయం    :  5.27
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

వృషభం: రుణయత్నాలు సాగిస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు తథ్యం.

మిథునం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. బాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిభారం.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కన్య: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

తుల: బంధువులతో వివాదాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. 

ధనుస్సు: అనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చిక్కులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.

మకరం: ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. కష్టించినా ఫలితం ఉండదు. రుణయత్నాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.

కుంభం: కుటుంబంలో ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. కార్యజయం. ఆస్తి ఒప్పందాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.

మరిన్ని వార్తలు