ఈ రాశివారు వ్యవహారాలలో విజయం సాధిస్తారు

3 Sep, 2021 06:23 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.ద్వాదశి పూర్తి(24గంటలు) నక్షత్రం పునర్వసు ప.3.42 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం రా.12.11 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.15 వరకు అమృతఘడియలు... ప.1.05 నుండి 2.50 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం     :  6.11
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నెమ్మదిగా సాగుతాయి.

వృషభం: పొరపాట్లు సరిదిద్దుకుని నిర్ణయాలు తీసుకుంటారు. పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి పిలుపు. సమస్యలు కొన్ని పరిష్కారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

సింహం: పనులలో ఆటంకాలు. వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

కన్య: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవ, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

తుల: పలుకుబడి పెరుగుతుంది. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీకు ఎదురులేని పరిస్థితి.

వృశ్చికం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పెరుగుతాయి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. పనుల్లో జాప్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 

మరిన్ని వార్తలు