ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి.. కొత్త పనులకు శ్రీకారం

4 Mar, 2022 06:21 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.విదియ రా.10.01 వరకు, తదుపరి తదియ నక్షత్రం ఉత్తరాభాద్ర రా.3.14 వరకు, తదుపరి రేవతి వర్జ్యం ప.12.42 నుండి 2.21 వరకు, దుర్ముహూర్తం ఉ.8.40 నుండి, 9.27 వరకు, తదుపరి ప.12.34 నుండి 1.21 వరకు అమృతఘడియలు... రా.10.22 నుండి 12.02 వరకు..

రాశిఫలాలు..
మేషం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలు ఆశించిన రీతిలో ఉంటాయి.

వృషభం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. భూలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మిథునం: రుణాలు చేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు.  కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తుంది.

కర్కాటకం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతగా ఆనుకూలించవు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన సమాచారం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

కన్య: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక.  భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో కొంత నిరాశ. వాహన యోగం.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో సఖ్యత. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మకరం: బంధువులతో వివాదాలు. ధనవ్యయం. కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.

మరిన్ని వార్తలు