ఈ రాశివారు నూతన ఉద్యోగాలు పొందుతారు..

4 Sep, 2021 06:22 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.ద్వాదశి ఉ.6.25 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం పుష్యమి సా.5.10 వరకు తదుపరి ఆశ్లేష, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ఉ.5.48 నుండి 7.26 వరకు అమృతఘడియలు... ఉ.10.20 నుండి 12.02 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూ వివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. వస్తులాభాలు. స్వల్ప ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.

మిథునం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. సోదరులతో సత్సంబంధాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి.

సింహం: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. విద్యార్థుల యత్నాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. విందు వినోదాలు. కొత్త పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన విధంగా కొనసాగుతాయి.

తుల: నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువుల నుంచి కొన్ని విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మకరం: సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కుంభం: నూతన పరిచయాలు. సంఘంలో విశేష ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మీనం: పనులు కొన్ని ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుమిత్రుల సహాయం అందుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు