ఈ రాశివారికి బాధ్యతలు పెరుగుతాయి..

5 Sep, 2021 06:45 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.త్రయోదశి ఉ.6.58 వరకు, తదుపరి చతుర్దశి నక్షత్రం ఆశ్లేష సా.6.06 వరకు తదుపరి మఖ, వర్జ్యం ఉ.6.26 నుండి 8.06 వరకు, దుర్ముహూర్తం సా.4.29 నుండి 5.20 వరకు, అమృతఘడియలు... సా.4.26 నుండి 6.06 వరకు.

సూర్యోదయం        :  5.49
సూర్యాస్తమయం    :  6.09
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు.

వృషభం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విందువినోదాలు.

మిథునం: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. 

కర్కాటకం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం: కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనసౌఖ్యం.

కన్య: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

తుల: ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

వృశ్చికం: కుటుంబంలో చికాకులు. అరోగ్య సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. మిత్రుల  నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు

మకరం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. యత్నకార్యసిద్ధి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కుంభం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. 

మీనం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
 
 

మరిన్ని వార్తలు