ఈ రాశివారు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు..

6 Sep, 2021 06:11 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి బ.చతుర్దశి ఉ.7.02 వరకు, తదుపరి అమావాస్య, నక్షత్రం మఖ సా. 6.34 వరకు, తదుపరి పుబ్బ వర్జ్యం ఉ.6.20 నుండి 7.58 వరకు, తిరిగి రా.2.34 నుండి4.10 వరకు, దుర్ముహూర్తం ప.12.22 నుండి 1.11 వరకు, తదుపరి ప.2.49 నుండి 3.40 వరకు, అమృతఘడియలు... సా.4.09 నుండి 5.47 వరకు, పొలాల అమావాస్య. 

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు 

మేషం: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.

మిథునం: ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పరుస్తాయి.

సింహం: బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య: ఇంటాబయటా ఒడిదుడుకులు. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. అంచనాలు నిజం కాగలవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి.

వృశ్చికం: సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతగా అనుకూలించదు.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మకరం: సోదరులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు కొన్ని వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదుర్కొంటారు.

కుంభం: బంధువులతో  సఖ్యత. ఆస్తులు వ్యవహారాలలో మరింత అనుకూలం. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
 

మరిన్ని వార్తలు