Horoscope Today: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

6 Oct, 2021 06:11 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరిస్‌: 

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి అమావాస్య సా.5.10 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి, నక్షత్రం హస్త రా.1.12 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం ఉ.10.04 నుండి 11.35 వరకు దుర్ముహూర్తం ప.11.24 నుండి 1.10 వరకు అమృతఘడియలు... రా.7.21 నుండి 8.54 వరకు.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.44
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి పిలుపు అందుతుంది. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

వృషభం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మిథునం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. వ్యవహారాలలో అవాంతరాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం: కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య: కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

తుల: దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆస్తి లాభం. ఆస్తుల వివాదాలు తీరతాయి. సోదరులతో సత్సంబంధాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ముఖ్య నిర్ణయాలు. భూలాభాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం. 

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు.  భూవివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం. చర్చలలో పురోగతి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు