ఈ రాశివారికి ఊహించని విధంగా ధనలాభం

6 Nov, 2021 06:14 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.విదియ రా.10.56 వరకు తదుపరి తదియ, నక్షత్రం అనూరాధ రా.3.40 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం ఉ.9.03 నుండి 10.32 వరకు దుర్ముహూర్తం ఉ.6.05 నుండి 7.35 వరకు అమృతఘడియలు... సా.5.58 నుండి 7.28 వరకు.

సూర్యోదయం :    6.04
సూర్యాస్తమయం    :  5.25
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: ముఖ్యమైన  పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

వృషభం: మీ శ్రమ ఫలిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మిథునం: సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తిలాభం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఇంటాబయటా అనుకూలం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: సన్నిహితులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: సన్నిహితుల నుంచి ధనలాభం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనులు కొన్ని మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం: కొత్త పరిచయాలు. ఊహించని విధంగా ధనలాభం. ముఖ్య సమాచారం అందుతుంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు.

కుంభం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనారోగ్యం. పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మరిన్ని వార్తలు