ఈ రాశివారికి ఆర్థికాభివృద్ధి, పలుకుబడి పెరుగుతుంది

7 Mar, 2022 06:14 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం, తిథి శు.పంచమి రా.11.32 వరకు, తదుపరిషష్ఠి, నక్షత్రం భరణి పూర్తి (24గంటలు), వర్జ్యం ప.3.20 నుండి 5.02 వరకు, దుర్ముహూర్తం ప.12.34 నుండి 1.20 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు అమృతఘడియలు... రా.1.34 నుండి 3.16 వరకు.


సూర్యోదయం :    6.19
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం... వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం... మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం... యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. ఆలోచనలు కలసివస్తాయి. మీ శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం... సన్నిహితులు సహకరిస్తారు. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కన్య... రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తుంది.

తుల... పరిస్థితులు అనుకూలిస్తాయి. పనుల్లో పురోభివృద్ధి. ఆకస్మిక ధనలాభం. అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

వృశ్చికం... మిత్రుల సలహాలు పాటిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కృషి ఫలిస్తుంది.

ధనుస్సు... వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థికంగా ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

మకరం... కార్యక్రమాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

కుంభం... శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

మీనం... నేర్పుగా వ్యవహరించడం మంచిది. అనారోగ్యం. దూరప్రయాణాలు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

మరిన్ని వార్తలు