ఈ రాశివారికి ఆదాయానికి మించి ఖర్చులు

7 Sep, 2021 06:20 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం తిథి అమావాస్య ఉ.6.30 వరకు, తదుపరి భాద్రపద శు.పాడ్యమి తె.5.29 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం పుబ్బ సా.6.34 వరకు, తదుపరి ఉత్తర, వర్జ్యం రా.1.39 నుండి 3.12 వరకు దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.46 నుండి 11.33 వరకు, అమృతఘడియలు... ప.12.10 నుండి 1.46 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు అంచనాలు తప్పుతాయి.

వృషభం: ఆదాయానికి మించి ఖర్చులు. అదనపు బాధ్యతలు. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. కార్యక్రమాలలో ఆటంకాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహ: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. కార్యక్రమాలలో ఆటంకాలు. దుబారా ఖర్చులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు .

తుల: ఉద్యోగయోగం. చర్చలు సఫలం. విందువినోదాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మీ అంచనాలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

వృశ్చికం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ∙ఇబ్బందికరంగా ఉంటుంది.

మకరం: ఆదాయానికి మించి ఖర్చులు. పనిభారం తప్పదు. కార్యక్రమాలలో ఆటంకాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

కుంభం: కుటుంబంలో శుభకార్యాలు. అదనపు రాబడి ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యజయం. కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.

మీనం: కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. ఆస్తిలాభం. వాహనసౌఖ్యం.
 

మరిన్ని వార్తలు