ఈ రాశి వారికి శుభవార్తలు అందుతాయి

9 Apr, 2022 06:17 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.అష్టమి రా.10.22 వరకు, తదుపరి నవమి నక్షత్రం పునర్వసు రా.1.53 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం ప.12.36 నుండి 2.22 వరకు దుర్ముహూర్తం ఉ.5.53 నుండి 7.31 వరకు అమృతఘడియలు... రా.11.12 నుండి 12.56 వరకు..

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  6.10
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశి ఫలాలు..

మేషం: ఏ కార్యక్రమం చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీ కృషిని మెచ్చుకుంటారు. విద్యాకాశాలు దక్కుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.

వృషభం: శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగావకాశాలు చేజారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మిథునం: కొత్త మిత్రులు పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎంతోకాలంగా ఉన్న ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తుల తగాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. 

వృశ్చికం: ఆర్థికంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల నుంచి పిలుపు. నిర్ణయాలు అందరూ సమర్థిస్తారు. వ్యాపారాలు వృద్ధి బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మకరం: సన్నిహితుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కుంభం: చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో కలహాలు. అనారోగ్య సూచనలు. మీపై కొన్ని బాధ్యతలు పడవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం: రాబడికి మించిన ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మరిన్ని వార్తలు