Horoscope Today: ఈ రాశి వారికి కొత్త ఉద్యోగాలు దక్కుతాయి..

9 Oct, 2021 06:06 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.తదియ ఉ.11.19 వరకు తదుపరి చవితి, నక్షత్రం విశాఖ రా.9.13 వరకు తదుపరి అనూరాధ, వర్జ్యం రా.12.56 నుండి 2.26వరకు దుర్ముహూర్తం ఉ.5.54 నుండి 7.30 వరకు అమృతఘడియలు... ప.1.01 నుండి 2.27 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.41
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.

వృషభం: పనుల్లో పురోగతి. ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. ఆర్థిక లాభాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మిథునం: ఆర్థిక ఇబ్బందులు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులు∙నిరాశ చెందుతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు బదిలీలు.

కర్కాటకం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలయ దర్శనాలు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక ప్రగతి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకం. వస్తులాభాలు.

కన్య: మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం..

తుల: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. అందరిలోనూ గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ముఖ్య సమాచారం.

వృశ్చికం: బంధువులతో మాటపట్టింపులు.  శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో కొన్ని  చికాకులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.

ధనుస్సు: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఉద్యోగయోగం.

మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. శుభకార్యాల నిర్వహణ.

కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. ఆలయ దర్శనాలు.

మీనం: బంధువులతో విభేదాలు. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. స్థిరాస్తి వివాదాలు తప్పవు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు