ఈ రాశి వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు

9 Nov, 2021 06:15 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.పంచమి ప.3.55 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ రా.10.54 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం ఉ.9.22 నుండి 10.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.26 నుండి 11.17 వరకు అమృతఘడియలు... సా.6.22 నుండి 7.52 వరకు.

సూర్యోదయం :    6.05
సూర్యాస్తమయం    :  5.24
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం.. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులు శ్రమపడాల్సిన పరిస్థితి. 

వృషభం.. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. 

మిథునం.. నూతన ఉద్యోగాలలో ప్రవేశిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారులకు ఊహించని పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవేత్తలకు కొత్త ఆశలు..

కర్కాటకం.. మీ కష్టం ఫలిస్తుంది. బంధువుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతారు. కార్యక్రమాలు సకాలంలో పూర్తి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. 

సింహం.. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులపై అదనపు బాధ్యతలు. .

కన్య.. కుటుంబసమస్యలు ఎదురవుతాయి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. అనారోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. .

తుల.. కొత్త విషయాలు గ్రహిస్తారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలలో లాభాలు దక్కే ఛాన్స్‌. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి. 

వృశ్చికం.. ముఖ్యమైన పనులలో అవాంతరాలు. ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలలో లాభాలు కష్టమే. ఉద్యోగాలలో శ్రమ. 

ధనుస్సు.. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. బంధువుల కలయిక. వస్తులాభాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. వాహనయోగం.

మకరం.. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. పనులలో అవాంతరాలు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభం.. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. 

మీనం.. పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కార్యజయం. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు