ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

10 Nov, 2021 06:17 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.షష్ఠి ప.1.54 వరకు, తదుపరి సప్తమి  నక్షత్రం ఉత్తరాషాఢ రా.9.34 వరకు, తదుపరి శ్రవణం వర్జ్యం ఉ.6.26 నుండి 7.56 వరకు, తిరిగి రా.1.24 నుండి 2.56 వరకు, దుర్ముహూర్తం ప.11.20 నుండి 12.06 వరకు అమృతఘడియలు... ప.3.31 నుండి 5.01 వరకు.

సూర్యోదయం :    6.06
సూర్యాస్తమయం    :  5.23
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు

రాశి ఫలాలు:

మేషం.. వ్యవహారాలలో పురోగతి. ఆశలు నెరవేరతాయి. విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం.. పనులు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో అకారణంగా విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం.. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. కొన్ని పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం.. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

సింహం.. సోదరులతో శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కన్య.. పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

తుల.. ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. సోదరులతో కలహాలు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం.. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు.. కుటుంబంలో సమస్యలు. అనుకోని ఖర్చులు. పనుల్లో ప్రతిష్ఠంభన. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

మకరం.. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలలో మరింత అభివృద్ధి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

కుంభం.. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు.

మీనం.. అందరితోనూ ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.

మరిన్ని వార్తలు