ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

11 Sep, 2021 06:10 IST|Sakshi

మేషం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

వృషభం: నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.

మిథునం: పనుల్లో కొంత జాప్యం. సోదరులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం: సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

కన్య: కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

తుల: శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. భూవివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం.

వృశ్చికం: శ్రమ తప్పదు. పనులు కొన్ని మధ్యలో నిలిపివేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.

కుంభం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు.

మీనం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
 

మరిన్ని వార్తలు