Horoscope Today: ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది

11 Oct, 2021 06:14 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.పంచమి ఉ.6.44 వరకు, తదుపరి షష్ఠి తె.4.09 వరకు (తెల్లవారితే మంగళవారం), నక్షత్రం జ్యేష్ఠ సా.5.56 వరకు, తదుపరి మూల, వర్జ్యం రా.1.21 నుండి 2.53 వరకు దుర్ముహూర్తం ప.12.11 నుండి 12.56 వరకు, తదుపరి ప.2.32 నుండి 3.17 వరకు, అమృతఘడియలు... ఉ.9.43 నుండి 11.04 వరకు.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.39
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమా«ధిక్యం. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం: సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు తీరతాయి. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

కర్కాటకం: పనులలో ప్రతిబంధకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. సోదరులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

సింహం: ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. నూతన వ్యక్తుల పరిచయం. ధనలాభం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. మీ ప్రతిపాదనలు అందరూ ఆమోదిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. శుభవర్తమానాలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: ఇంతకాలం పడిన శ్రమ వృథా కాగలదు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: పొరపాట్లు సరిదిద్దుకుంటారు. పనులు చక్కదిద్దుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కుంభం: నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. వాహనయోగం. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం: వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. సోదరులతో విభేదాలు. దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. 

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు