ఈ రాశివారి ఆరోగ్యం మందగిస్తుంది

11 Nov, 2021 06:18 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్‌:

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.సప్తమి ప.12.02 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం శ్రవణం రా.8.32 వరకు, తదుపరి ధనిష్ఠ, వర్జ్యం రా.12.25 నుండి 1.57 వరకు, దుర్ముహూర్తం ఉ.9.50 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.20 నుండి 3.05 వరకు అమృతఘడియలు... ఉ.10.32 నుండి 12.06 వరకు.

సూర్యోదయం :    6.06
సూర్యాస్తమయం    :  5.22
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

రాశి ఫలాలు:

మేషం.. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. భూయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృషభం.. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

మిథునం.. వ్యవహారాలు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం.. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

సింహం.. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సహకరిస్తారు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

కన్య.. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల.. సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం.. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. భూ, వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

ధనుస్సు.. సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మకరం.. వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. శుభవార్తలు వింటారు. సోదరులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కుంభం.. పనులు నత్తనడకన సాగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక  ప్రయాణాలు. రుణయత్నాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మీనం.. పనులు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సర్దుబాట్లు.

మరిన్ని వార్తలు