ఈ రాశివారు కొత్త పనులు చేపడతారు

12 Sep, 2021 06:40 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.షష్ఠి రా.7.47 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం విశాఖ ప.1.11 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం సా.4.54 నుండి 6.24 వరకు దుర్ముహూర్తం సా.4.25 నుండి 5.14 వరకు, అమృతఘడియలు... రా.1.53 నుండి 3.20 వరకు.

సూర్యోదయం        :  5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పనులలో ప్రతిబంధకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఇబ్బందులు.

వృషభం: ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

మిథునం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. కార్యసిద్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

కర్కాటకం: శ్రమ మరింత పెరుగుతుంది. ఆత్మీయులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో చికాకులు.

సింహం: ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు.

కన్య: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.

తుల: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. అనుకోని ధనవ్యయం. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. మానసిక అశాంతి. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం దక్కుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: వ్యయప్రయాలతో పనులు పూర్తి చేస్తారు. బంధువర్గంతో విరోధాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి ఒత్తిడులు.

మకరం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

మీనం: పనులు చక్కదిద్దడంలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు