ఈ రాశివారికి కుటుంబంలో చికాకులు

12 Oct, 2021 05:42 IST|Sakshi

రాశి ఫలాలు ఫోటో స్టోరిస్‌: 

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం తిథి శు.సప్తమి రా.1.50 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం మూల సా.4.19 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ప.2.47 నుండి 4.17 వరకు, తిరిగి రా.1.17 నుండి 2.47 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.03 వరకు తదుపరి రా.10.32 నుండి 11.20 వరకు, అమృతఘడియలు ...ఉ.10.19 నుంచి 11.47 వరకు, శ్రీ సరస్వతీ పూజ.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.39
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు

రాశి ఫలాలు:

మేషం.. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు.వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం.. చేపట్టిన కార్యక్రమాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా. శ్రమాధికం. మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.

మిధునం.. కొత్త పనులు చేపడతారు. బంధువుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు ఉత్సాహం. 

కర్కాటకం.. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం.. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.

కన్య.. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.
 
తుల.. అనుకోని ఆర్థిక లాభాలు. ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగులకు అనుకూలం.

వృశ్చికం.. కుటుంబంలో చికాకులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

ధనుస్సు.. పలుకుబడి పెరుగుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. సంఘంలో గౌరవం. చర్చలు సఫలం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

మకరం.. వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధికం. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

కుంభం.. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

మీనం.. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు