ఈ రాశి వారు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు

12 Nov, 2021 06:18 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.అష్టమి ఉ.10.31 వరకు, తదుపరి నవమి నక్షత్రం ధనిష్ఠ రా.7.50 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం రా.2.57 నుండి 4.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.20 నుండి 9.05 వరకు తదుపరి ప.12.05 నుండి 12.50 వరకు అమృతఘడియలు... ఉ.9.44 నుండి 11.17 వరకు.

సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం :  5.22
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

రాశి ఫలాలు: 

మేషం... వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

వృషభం... పనులలో పురోగతి. భూవివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మిథునం.. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం.... సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం... మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి సాధిస్తారు.

కన్య... దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

తుల.... సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబససమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం... రాబడికి మించి ఖర్చులు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. సోదరులతో కలహాలు. కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

ధనుస్సు..... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు తీరతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం.... కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో ఆటంకాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కుంభం... సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం.... వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మరిన్ని వార్తలు