శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి శు.ద్వాదశి రా.2.40 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం మఖ ఉ.7.25 వరకు, తదుపరి పుబ్బ, వర్జ్యం ప.3.43 నుండి 5.22 వరకు, దుర్ముహూర్తం ఉ.11.34 నుండి 12.25 వరకు అమృతఘడియలు... రా.1.42 నుండి 3.21 వరకు, ప్రణీతానది పుష్కరాలు ప్రారంభం.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.
వృషభం: మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. అనారోగ్యం. పనులు నత్తనడకన సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో బదిలీ సూచనలు.
మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత.
కర్కాటకం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.
సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు అనుకున్నరీతిలో వేగంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.
కన్య: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. కుటుంబంలోకొద్దిపాటి వివాదాలు. వ్యాపారాలలో సామాన్యలాభాలు పొందుతారు. ఉద్యోగాలలో మార్పులు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుంటారు.
వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధనలాభం. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: సన్నిహితులతో వివాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.
మకరం: ఆధ్యాత్మిక చింతన. మిత్రులతో విభేదాలు. పనుల్లో అవాంతరాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కుంభం: ఆర్థిక వ్యవహారాలలో పురోభివృద్ధి. సన్నిహితుల నుంచి పిలుపు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
మీనం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.