ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు

13 Sep, 2021 06:04 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు  భాద్రపద మాసం, తిథి శు.సప్తమి సా.5.24 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం అనూరాధ ఉ.11.33 వరకు, తదుపరి జ్యేష్ఠ వర్జ్యం సా.4.45 నుండి 6.13 వరకు, దుర్ముహూర్తం ప.12.21 నుండి 1.10 వరకు, తదుపరి ప.2.46 నుండి 3.35 వరకు అమృతఘడియలు... రా.1.41 నుండి 3.10 వరకు.

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం : ఉ. 7.30 నుంచి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుంచి 12.00 వరకు

రాశి ఫలాలు:

మేషం.. నిర్మాణరంగం వారికి అవాంతరాలు. పనులు కొన్ని మధ్యలో వాయిదా. శ్రమ తప్పదు. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

వృషభం.. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం.. సన్నిహితులతో  ఉత్సాహంగా గడుపుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

కర్కాటకం.. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

సింహం.. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. పనుల్లో జాప్యం. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.

కన్య.. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ప్రతిష్ఠ పెరుగుతుంది. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

తుల.. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం.. కొత్త పనులు చేపడతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు సైతం వసూలవుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

ధనుస్సు.. దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మకరం.. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.

కుంభం.. పలుకుబడి పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి.

మీనం.. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు