Horoscope Today: ఈ రాశి వారు భూములు, వాహనాలు కొంటారు..

13 Oct, 2021 06:13 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి శు.అష్టమి రా.11.43 వరకు తదుపరి నవమి, నక్షత్రం పూర్వాషాఢ ప.2.47 వరకు తదుపరి ఉత్తరాషాఢ, వర్జ్యం రా.10.23 నుండి 11.54 వరకు దుర్ముహూర్తం ప.11.22 నుండి 12.10 వరకు అమృతఘడియలు... ఉ.10.18 నుండి 11.46 వరకు, దుర్గాష్టమి.

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనులు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ఒత్తిడులు.

వృషభం: బంధువుల నుంచి విమర్శలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

మిథునం: వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. 

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. వాహనాలు కొంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోగతి.

సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య: ఆదాయానికి మించి ఖర్చులు. స్థిరాస్తి వివాదాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు. దైవదర్శనాలు.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక ప్రగతి ఉంటుంది. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

వృశ్చికం: బంధువులతో తగాదాలు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. ముఖ్య వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

ధనుస్సు: శుభవార్తలు వింటారు. భూవివాదాల పరిష్కారం. సంఘంలో గౌరవం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం: కార్యజయం. ఆస్తిలాభం.  ఊహించని ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

మరిన్ని వార్తలు