ఈ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి

13 Nov, 2021 05:41 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి శు.నవమి ఉ.9.21 వరకు, తదుపరి దశమి, నక్షత్రం శతభిషం రా.7.34 వరకు, తదుపరి పూర్వాభాద్ర, వర్జ్యం రా.2.00 నుండి 3.38 వరకు దుర్ముహూర్తం ఉ.6.06 నుండి 7.34 వరకు అమృతఘడియలు... ప.12.27 నుండి 2.02 వరకు.

సూర్యోదయం :  6.06
సూర్యాస్తమయం :  5.22
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం... ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. శుభవార్తలు వింటారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం... ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.

మిథునం... ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. 

కర్కాటకం.. సన్నిహితులతో కలహాలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం.

సింహం... పనులలో ముందుకు సాగుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి.  వార్తలు వింటారు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కన్య.. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభవార్తలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల.... ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.

వృశ్చికం... వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు.... ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా సాగుతాయి.

మకరం... వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం.... సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మీనం... పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మరిన్ని వార్తలు