Daily Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి

14 Feb, 2022 06:07 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి శు.త్రయోదశి రా.7.50 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం పునర్వసు ప.11.34 వరకు, తదుపరి పుష్యమి వర్జ్యం రా.8.16 నుండి 10.01 వరకు, దుర్ముహూర్తం ప.12.36 నుండి 1.22 వరకు, తదుపరి ప.2.55 నుండి 3.41 వరకు అమృతఘడియలు... ఉ.8.56 నుండి 10.44 వరకు.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విరోధాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

వృషభం: పనులలో ప్రగతి. నూతనోత్సాహం. కార్యక్రమాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

మిథునం: మిత్రుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి లాభం. వ్యవహారాలు పురోగతిలో సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. చర్చలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలను పరిష్కరించుకుంటారు.

వృశ్చికం: వ్యవహారాలు నిదానిస్తాయి. దూరప్రయాణాలు. సోదరులతో కలహాలు. ధనవ్యయం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: సన్నిహితులే శత్రువులుగా మారవచ్చు. ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో జాప్యం. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మకరం: మిత్రుల ద్వారా ధనలబ్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. మీ ఆలోచనలు అమలు చేస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ప్రత్యేక గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. రావలసిన సొమ్ము అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.

మరిన్ని వార్తలు