Horoscope Today: ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు..

14 Oct, 2021 06:11 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి శు.నవమి రా.9.54 వరకు, తదుపరి దశమి, నక్షత్రం ఉత్తరాషాఢ ప.1.34 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం సా.5.24 నుండి 6.56 వరకు, దుర్ముహూర్తం ఉ.9.51 నుండి 10.36 వరకు, తదుపరి ప.2.31 నుండి 3.16 వరకు, అమృతఘడియలు .... ఉ.7.28 నుండి 9.01 వరకు, తిరిగి రా. 2.36 నుండి 4.10 వరకు, మహర్నవమి.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

మేషం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మిథునం: బంధువులతో విరోధాలు. అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.

కర్కాటకం: మిత్రులతో సఖ్యత. విచిత్రమైన సంఘటనలు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. భూలాభాలు. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. గతం గుర్తుకు వస్తుంది. వ్యవహారాలు సకాలంలో పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో తగాదాలు. దూరప్రయాణాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు.

మకరం: పలుకుబడి పెంచుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళపరుస్తాయి.

మీనం: బాకీలు వసూలవుతాయి. ఆసక్తికర సమాచారం. చర్చలు సఫలం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు