ఈ రాశివారికి ప్రయాణాల్లో మార్పులు

14 Nov, 2021 06:39 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం తిథి శు.దశమి ఉ.8.44 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం పూర్వాభాద్ర రా.7.44 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర వర్జ్యం తె.5.37 నుండి 7.16 వరకు, (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం సా.3.50 నుండి 4.35 వరకు, అమృతఘడియలు... ఉ.11.42 నుండి 1.20 వరకు.

సూర్యోదయం        :  6.07
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం.. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం.. సన్నిహితుల నుంచి ధనలాభం. క్రయవిక్రయాలు లాభిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మిథునం.. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కర్కాటకం.. పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం.. బంధువర్గం సలహాలు స్వీకరిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కన్య.. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. గృహయోగం. ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.

తుల.. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి. దైవచింతన.

వృశ్చికం.. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు.. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తీరతాయి.

మకరం.. కుటుంబంలో ఒత్తిడులు. వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. మిత్రులతో తగాదాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. భూవివాదాలు తీరతాయి. ధనప్రాప్తి. చర్చలు సఫలం. వాహనయోగం. వ్యాపారాలు, ఉధ్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం.. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

మరిన్ని వార్తలు