ఈ రాశి వారికి ఉద్యోగాలలో కీలక మార్పులు

15 Sep, 2021 06:09 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి శు.నవమి ప.12.40 వరకు, తదుపరి దశమి, నక్షత్రం మూల ఉ.8.18 వరకు, తదుపరి పూర్వాషాఢ వర్జ్యం ఉ.6.48 నుండి 8.19 వరకు, తిరిగి సా.5.17 నుండి 6.47 వరకు, దుర్ముహూర్తం ప.11.31 నుండి 12.21 వరకు, అమృతఘడియలు...రా.2.20 నుండి 3.50 వరకు.

సూర్యోదయం :  5.51
సూర్యాస్తమయం :  6.03
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు: 

మేషం...  ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. కొద్దిపాటి ఆస్తిలాభం.  వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృషభం...  సన్నిహితుల నుంచి ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెంచుకుంటారు. శ్రమ ఫలిస్తుంది.  వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మిథునం....  శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. దూరప్రయాణాలు. 

కర్కాటకం....  సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

సింహం....  నూతన పరిచయాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య...  రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

తుల....  ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తు, వస్త్రలాభాలు.  ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృశ్చికం...  పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలిసిరావు.

ధనుస్సు...  కొత్త పరిచయాలు. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ఆస్తుల విషయంలో కొత్త అంచనాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.  ఉద్యోగాలలో కీలక మార్పులు.

మకరం....  నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సోదరుల నుంచి ధనప్రాప్తి. కుటుంబసమస్యల పరిష్కారం. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కుంభం...  రుణాల కోసం యత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధుమిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం...  వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. పనులు నెమ్మదిగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

రాశి ఫలాలు ఫోటో స్టోరీస్

Read latest Astrology News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు